BREAKING
సర్పంచ్ సుంకె ప్రసాద్‌ జన్మదినం సందర్భంగా ఘనసత్కారం* పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కరువు మండలంగా వత్సవాయి.. పంట నష్టపరిహారం కోసం రైతులు వివరాలు నమోదు చేసుకోవాలి అర్హులైన రైతులు అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ వట్టెంల గ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుడు వెంకటేష్ పార్థివదేహం ట్రాక్టర్ డోజర్ స్వాధీనానికి వెళ్లిన అటవీ అధికారులు…అడ్డుకున్న గిరిజనులు... ఉద్యోగాలు తరలిస్తే భారీ సుంకాలు తప్పవు: అమెరికా కంపెనీలను హెచ్చరించిన జేడీ వాన్స్! శ్రీ సంఘమిత్ర పాఠశాలలో... ఘనంగా బతుకమ్మ సంబరాలు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన ఎమ్మెల్యే పనామాలో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రత నమోదు.. భయంతో రోడ్లపైకి పరుగులు తీసిన జనం! మాటలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం.. హామీల అమలులో నిర్లక్ష్యం పోలంపల్లిలో వైఎస్ఆర్ సీపీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం క్యాడర్ ఐడీ కార్డులు పంపిణీ చేసిన తన్నీరు నాగేశ్వరరావు భైరగులపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు తూప్రాన్ గీతా జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు సేవకు మారుపేరు లయన్ రవికుమార్ గౌడ్ -- సెంచరీ పూర్తి చేసుకున్న మీల్స్ ఆన్ వీల్స్ -- నారాయణపేటలో వరుసగా 100రోజుల పాటు అన్నదానం నిరసనలకు ముందస్తు అనుమతి కోరడం ప్రజాస్వామ్య వ్యతిరేకం కాదు: ఆంక్షలపై ఢిల్లీ పోలీసుల కీలక సమర్థన! దసరా సెలవులు: పిల్లలపై ప్రత్యేక నిఘా అవసరం!

ఇజ్రాయెల్ విమానాశ్రయంపై దాడికే కుట్ర: యూఏఈ!

Select Suryaa Now
ఇజ్రాయెల్ విమానాశ్రయంపై దాడికే కుట్ర:  యూఏఈ!

సూర్య అంతర్జాతీయ డెస్క్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో భారత సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై కాక్‌పిట్‌లో గొడ్డలితో దాడి చేసిన ఉదంతంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దర్యాప్తు సంస్థలు విస్తుపోయే వాస్తవాలను వెల్లడించాయి. ఆ విమానాన్ని అపహరించి, ప్రయాణికులతో సహా ఇజ్రాయెల్‌లోని ప్రధాన విమానాశ్రయ టెర్మినల్‌పైకి కూల్చివేసి సామూహిక మారణహోమానికి పాల్పడాలనే పక్కా ప్లాన్‌తోనే ఒమన్ జాతీయుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు యూఏఈ ప్రాసిక్యూటర్లు అధికారికంగా ధ్రువీకరించారు.

యూఏఈ దర్యాప్తు వివరాల ప్రకారం.. 9/11 తరహా ఉగ్రదాడి ఆలోచనలతో తీవ్రవాద భావజాలానికి ఆకర్షితుడైన కో-పైలట్, విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్‌లోని ఎమర్జెన్సీ క్రాష్ యాక్స్‌తో భారత పైలట్ స్మిత్ మచ్చార్‌పై వెనుక నుంచి విచక్షణారహితంగా దాడి చేశాడు. విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకుని వేగంగా కిందకు మళ్లించడంతో కొద్ది సెకన్లలోనే విమానం దాదాపు 16,000 అడుగుల మేర కిందికి పడిపోయింది. అయితే తీవ్ర రక్తస్రావం జరుగుతున్నప్పటికీ ధైర్యసాహసాలు ప్రదర్శించిన కెప్టెన్ స్మిత్, కాక్‌పిట్ తలుపులను తెరవడంతో పాటు ప్రయాణికుల సహాయంతో నిందితుడిని నిలువరించగలిగారు. అనంతరం ప్రయాణికుల్లోని ఇద్దరు రిజర్వ్ పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు.

ఈ దురాఘతాన్ని పక్కా ఉగ్రవాద చర్యగా పరిగణించిన యూఏఈ అధికారులు, నిందితుడిపై సమగ్ర విచారణను వేగవంతం చేశారు. ప్రాణాలకు తెగించి విమాన ప్రమాదాన్ని తప్పించిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ను ఇజ్రాయెల్ ప్రభుత్వం తమ అత్యున్నత పౌర సాహస పురస్కారానికి ఎంపిక చేయగా, ప్రస్తుతం ఆయన యూఏఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఈ విచారణ నివేదిక ప్రపంచ విమానయాన రంగంలో భద్రతా నిబంధనలపై తీవ్ర చర్చకు దారితీసింది.