BREAKING
హోర్ముజ్ జలసంధిలో భారీ ఎల్‌పీజీ నౌకపై ఇరాన్ దాడి నెట్‌ఫ్లిక్స్‌లో ఉద్యోగుల కోతకు రంగం సిద్ధం.. అమెరికా ఆర్థిక ప్రగతికి గ్రీన్ కార్డ్, హెచ్-1బీలే ఇంధనం: యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ (USISPF) కీలక విశ్లేషణ! పెద్దల అమావాస్య.. మాంసం మార్కెట్‌ కిటకిట! ప్రపంచంలోనే కీలక టెలికాం టెక్నాలజీ దేశంగా భారత్ అవతరణ:. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి! ‘సముద్ర లక్ష్మణ’ 4వ ఎడిషన్ విన్యాసాలకు మలేషియా చేరుకున్న ఐఎన్‌ఎస్ మైసూర్: తెలంగాణలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.. ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉద్రిక్తత: సీజేపీ ఆందోళనకు పోలీసుల అనుమతి నిరాకరణ తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం: తోటల్లో కనిపించడంతో వణికిపోతున్న స్థానికులు.. ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని అటవీశాఖ హెచ్చరిక! సర్పంచ్ సుంకె ప్రసాద్‌ జన్మదినం సందర్భంగా ఘనసత్కారం* పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. కరువు మండలంగా వత్సవాయి.. పంట నష్టపరిహారం కోసం రైతులు వివరాలు నమోదు చేసుకోవాలి అర్హులైన రైతులు అవసరమైన పత్రాలతో రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలి రైతులకు సూచించిన మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ వట్టెంల గ్రామానికి చేరిన గల్ఫ్ కార్మికుడు వెంకటేష్ పార్థివదేహం ట్రాక్టర్ డోజర్ స్వాధీనానికి వెళ్లిన అటవీ అధికారులు…అడ్డుకున్న గిరిజనులు...

మాటలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం.. హామీల అమలులో నిర్లక్ష్యం పోలంపల్లిలో వైఎస్ఆర్ సీపీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం క్యాడర్ ఐడీ కార్డులు పంపిణీ చేసిన తన్నీరు నాగేశ్వరరావు

Select Suryaa Now
మాటలకే పరిమితమైన కూటమి ప్రభుత్వం.. హామీల అమలులో నిర్లక్ష్యం  పోలంపల్లిలో వైఎస్ఆర్ సీపీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం  క్యాడర్ ఐడీ కార్డులు పంపిణీ చేసిన తన్నీరు నాగేశ్వరరావు

జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు హాజరై పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ క్యాడర్‌కు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటి అమలులో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలో అమలు చేయాలని, అభివృద్ధి పేరుతో ప్రకటనలు చేయడం కాకుండా ప్రజలకు స్పష్టమైన ఫలితాలు చూపించాలని డిమాండ్ చేశారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పార్టీ శ్రేణులంతా ఐకమత్యంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజలతో సమన్వయం పెంచుకుంటూ పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.అనంతరం వైఎస్ఆర్ సీపీ క్యాడర్‌కు ఐడీ కార్డులను పంపిణీ చేసి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుత్తా శంకర్రావు, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి కాటేపల్లి రవి, గ్రామ పార్టీ అధ్యక్షుడు తమ్మినేని ప్రదీప్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవ శ్రీనివాస్ గౌడ్, జిల్లా పంచాయతీరాజ్ విభాగ ప్రధాన కార్యదర్శి యేసుపోగు శ్రీనివాసరావు, మండల ఆర్టీఐ విభాగ అధ్యక్షుడు కుంచపు మోషే, ముస్లిం మైనార్టీ విభాగ అధ్యక్షుడు షేక్ బాజీ, మాజీ సర్పంచ్ మాడుగుల లాజర్, కాటేపల్లి లాల్ బహుదూర్, గుత్తా బొబ్బిలి తదితరులు పాల్గొన్నారు.