BREAKING
ఓటు హక్కుకు మరో అవకాశం! 'అర్హుడి ఓటు గల్లంతు కాకూడదు.. ఇంటింట మళ్లీ సర్వే' గ్యాస్‌ లారీ ఢీకొని యువకుడి దుర్మరణం కోకో ప్లాంటేషన్ పనులను పర్యవేక్షించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.ఎస్. రామ్ గోపాల్ కడియంలో వైన్స్‌ షాపులు ఇష్టారాజ్యం! ఢిల్లీలో తీవ్ర కలకలం: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు CJP నేతల అరెస్ట్ బౌలర్ల కెరీర్లూ ప్రమాదంలో ఉన్నాయి": 250 పరుగులు కాపాడుకోలేకపోయిన భారత్‌పై గంభీర్ స్పందన అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మోర్చా సన్మానం రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు గన్నవరం విద్యార్థిని చిన్మయి.. అండర్‌–19 విభాగంలో ప్లస్‌ 70 కేజీల కేటగిరీలో ఎంపిక. భారీ దిగుమతులకు అనుమతి ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల ధరలు విపరీతంగా పెరగడంతో పుతిన్ నుంచి డీజిల్ దిగుమతి భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుకు 80వేలు విరాళం అందజేసిన ఎమ్మెల్యే. ఆర్థిక నివేదికల ఆధారంగానే నిర్దిష్ట ప్రగతి లక్ష్యాలు: సీఎం చంద్రబాబు ఆదేశం! తడ్కల్‌ లో కదం తొక్కిన రైతన్నలు ఆటోలో తరలిస్తున్న రేషన్ జొన్నలను గుర్తించిన అధికారులు.. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు ఇథియోపియాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలి: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పిలుపు!

హోర్ముజ్ జలసంధిలో భారీ ఎల్‌పీజీ నౌకపై ఇరాన్ దాడి

Select Suryaa Now
 హోర్ముజ్ జలసంధిలో భారీ ఎల్‌పీజీ నౌకపై ఇరాన్ దాడి

సూర్య అంతర్జాతీయ డెస్క్: వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. టెహ్రాన్ అనుమతించని 'అనధికారిక మార్గం' (ఇల్లీగల్ రూట్) ద్వారా హోర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన భారీ ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధికారికంగా ప్రకటించింది. ఈ దాడి కారణంగా ఆ భారీ కార్గో నౌక ఇంజిన్ రూమ్, ప్రొపల్షన్ వ్యవస్థలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయని ఇరాన్ సైన్యం వెల్లడించింది.

ఇరాన్ అధికారిక వార్తా సంస్థల కథనం ప్రకారం.. 'నట్‌విట్' సంస్థకు చెందిన 'ఎన్‌వీ సన్‌షైన్' (NV Sunshine) అనే భారీ ఎల్‌పీజీ క్యారియర్ నౌక హోర్ముజ్ జలసంధికి దక్షిణాన ఉన్న అనధికార మార్గంలో ప్రయాణించేందుకు యత్నించింది. హోర్ముజ్ జలసంధి పర్యవేక్షణ, రవాణా నిర్వహణను తమ అధీనంలోకి తీసుకున్నామని పేర్కొన్న ఐఆర్‌జీసీ నౌకాదళం.. నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణించినందుకే ఆ నౌకను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు స్పష్టం చేసింది.

ప్రాంతీయ సముద్ర రవాణాలో ఉద్రిక్తతలు పెరగడానికి అమెరికా దూకుడు సైనిక చర్యలే ప్రధాన కారణమని ఇరాన్ సైన్యం ఆరోపించింది. తమ జలాల్లో శత్రు బలగాల ఉనికిని లేదా తమ నిర్వహణకు ఆటంకం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఉపేక్షించబోమని హెచ్చరించింది. అంతేకాకుండా, అనధికార మార్గాల్లో ప్రయాణించే నౌకలపై చర్యలు కేవలం హోర్ముజ్ జలసంధికే పరిమితం కావని, ప్రాంతంలో ఎక్కడైనా సరే వాటిని వెంబడించి కఠిన చర్యలు తీసుకుంటామని ఐఆర్‌జీసీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో జరిగిన ఈ దాడి అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.