BREAKING
ఓటీటీలోకి 'ప్రేమలు' నటుడి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే! రాజ్ భవన్ ముట్టడికి యత్నం షై హోప్ విధ్వంసకర సెంచరీ.. టీమిండియాపై వెస్టిండీస్ చారిత్రాత్మక రికార్డు విజయం! ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా శిథిలాల కింద కొనసాగుతున్న సహాయక చర్యలు ఓట్ల దొంగ జ్ఞానేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి విబిజి రామ్ జీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణం* మంగువాయిబాడవ గ్రామంలో అట్టహాసంగా ఎంగిల పూల బతుకమ్మ సంబరాలు. సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. 12 వేలకు పైగా ప్రత్యేక బస్సులు! రూపాయి విలువను పరిరక్షించేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం డర్బన్ టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ల హవా: ఆస్ట్రేలియా 187/6 వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పల్లకీ సేవ అమెరికా ఆటో కార్మికుల సంఘం అధ్యక్ష ఎన్నికల్లో షాన్ ఫైన్ రెండోసారి విజయం ఆఫ్ఘన్ బౌలర్ల పట్టు: బంగ్లాదేశ్ 333/8.. రెండో రోజు తొలి సెషన్‌లో నెమ్మదిగా సాగిన ఆట ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలపై పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు భవాని దీక్ష (భవాని మాల) వెనుక విశిష్టమైన పురాణ గాథ

అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మోర్చా సన్మానం

Select Suryaa Now
అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మహిళా మోర్చా సన్మానం

కడియం, మేజర్ న్యూస్,ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు, ‘సేవా కే 25 వర్ష్‌’ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం కడియం గిరిజాల కళ్యాణమండపంలో  అంగన్వాడీ కార్యకర్తలను బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కాకినాడ జిల్లా బీజేపీ ఇన్‌ఛార్జి ఆకుల శ్రీధర్‌ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ కార్యకర్తలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. తల్లిలా ఆదరిస్తూ నిస్వార్థంగా సేవలందిస్తున్న వారి కృషిని గుర్తించి సత్కరించడం సంతోషంగా ఉందన్నారు. మోదీ 25 ఏళ్ల సేవా ప్రస్థానం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
సన్మానం పొందిన అంగన్వాడీ కార్యకర్తలు బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొరుసు సుబ్రమణ్యం, మండల ఇన్‌ఛార్జి తనుబుద్ధి సూర్యభాస్కర్‌, నాగులపల్లి వీరబాబు, చిక్కాల శ్రీను, దాసరి ముత్యం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు తాళాబత్తుల భవానీ భాస్కర్‌, బొప్పన లోవరాజు, కొత్తపల్లి శివ, ఉప్పు నాగేంద్ర, యర్రా సింహాచలం, యర్రంశెట్టి సాయి, చప్పిడి ప్రసాద్‌, గారపాటి తాతబ్బాయి, పళ్ల లలిత, కోటిపల్లి స్రవంతి, గొర్రెల రామలక్ష్మి, మేకా వీరమణి, చిట్టూరి రాణి తదితరులు పాల్గొన్నారు.