BREAKING
త్రివిక్రమ్‌ను 'మా' ఎందుకు ప్రశ్నించట్లేదు.. పూనమ్ కౌర్ సంచలన పోస్ట్! సుస్మిత కొణిదల అమ్మవారి దర్శనం రేపటినుండి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు దసరా సెలవులతో సొంతూళ్లకు కదులుతున్న జనం ఓటీటీలోకి 'ప్రేమలు' నటుడి థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే! రాజ్ భవన్ ముట్టడికి యత్నం షై హోప్ విధ్వంసకర సెంచరీ.. టీమిండియాపై వెస్టిండీస్ చారిత్రాత్మక రికార్డు విజయం! ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా శిథిలాల కింద కొనసాగుతున్న సహాయక చర్యలు ఓట్ల దొంగ జ్ఞానేష్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి విబిజి రామ్ జీ పథకంలో ఇంకుడు గుంతల నిర్మాణం* మంగువాయిబాడవ గ్రామంలో అట్టహాసంగా ఎంగిల పూల బతుకమ్మ సంబరాలు. సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. 12 వేలకు పైగా ప్రత్యేక బస్సులు! రూపాయి విలువను పరిరక్షించేందుకు ఆర్‌బీఐ కీలక నిర్ణయం డర్బన్ టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ల హవా: ఆస్ట్రేలియా 187/6 వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పల్లకీ సేవ

ఓటు హక్కుకు మరో అవకాశం! 'అర్హుడి ఓటు గల్లంతు కాకూడదు.. ఇంటింట మళ్లీ సర్వే'

Select Suryaa Now
ఓటు హక్కుకు మరో అవకాశం!  'అర్హుడి ఓటు గల్లంతు కాకూడదు.. ఇంటింట మళ్లీ సర్వే'

గోపాలపురం, (మేజర్ న్యూస్): ఓటు హక్కు ఉన్నా.. జాబితాలో లేకపోతే ఆ హక్కుకు విలువేది? ఈ ప్రశ్నకు సమాధానంగా గోపాలపురం నియోజకవర్గంలో ఇంటింటా పునఃపరిశీలన పర్వం గురువారం మొదలైంది.
ఈ సందర్భంగా ఓటరు నమోదు అధికారి పి.భాగ్యవతి మాట్లాడుతూ.. 'ఒక్క అర్హుడి ఓటు కూడా గల్లంతు కాకూడదు.. ఒక్క అనర్హుడి పేరూ మిగలకూడదన్నదే మా లక్ష్యం. అందుకే తొలగించిన ఓటర్ల జాబితాలను మరోసారి ఇంటింటా పరిశీలించేందుకు శ్రీకారం చుట్టాం' అని తెలిపారు.

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రారంభ సమయంలో నియోజకవర్గంలో 2,43,471 మంది ఓటర్లు ఉన్నారని ఆమె వివరించారు. "ఇందులో మృతులు 8,659 మంది, శాశ్వతంగా వలస వెళ్లినవారు 3,485 మంది, రెండు చోట్ల ఓట్లు కలిగినవారు 3,186 మంది, ఆచూకీ లేనివారు 885 మంది ఉన్నట్లు గుర్తించాం. ఇలా మొత్తం 16,215 మందిని తొలగించగా, మిగిలిన 2,27,204 మంది ఓటర్లతో జూలై 31న ముసాయిదా జాబితా ప్రచురించాం అని చెప్పారు.
తాజాగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఈ జాబితాలను పునఃపరిశీలిస్తారు. అందులో అర్హులైన ఓటర్లు కనిపిస్తే వారితో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేయిస్తారు. అలాగే సంబంధిత పోలింగ్ కేంద్రాల బూత్ స్థాయి ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి, జాబితాలను చదివి వినిపించాలని ఆదేశాలు జారీ చేశాం అని పేర్కొన్నారు.

ఈ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. "రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు, గ్రామపెద్దలు, ప్రజలు, బూత్ స్థాయి ఏజెంట్లు కూడా ఈ జాబితాలను పరిశీలించాలి. అర్హులైన వారు ఓటు హక్కు పొందేలా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు సహకరించాలి" అని కోరారు.