పిసిసి అధ్యక్షురాలు కలిసిన కృష్ణారెడ్డి.
సూర్య న్యూస్ దర్శి.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ తో ఆల్ ఇండియా ఆన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్, ఎంప్లాయిస్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా,నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమాల గురించి కృష్ణారెడ్డిని షర్మిల అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన కార్యక్రమాల గురించి షర్మిల దిశా నిర్దేశం చేసినట్లు కృష్ణారెడ్డి తెలిపారు.