నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.
.
అమరావతిలోని ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ అత్యవసర సమావేశం ప్రారంభంకానుంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, వాటిలో అనుసరించాల్సిన విధానాలపై కేబినెట్‌లో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల శాతంపై నెలకొన్న పరిస్థితులు, న్యాయపరమైన చిక్కులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ఈ సమావేశంలో సమగ్రంగా సమీక్షించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.