BREAKING
వడ్లమూడిలో సంగం డైరీ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్లు, డీలర్ల సమావేశం పల్లె నిద్రతో ప్రజలతో మమేకమైన సిఐ,ఎస్ఐ. జగ్గయ్యపేట పట్టణం లో 18వ రోజుకి చేరుకున్న గడప గడపకు ప్రజా పోరుబాట కార్యక్రమం కిచెన్ గార్డెన్... ఆరోగ్యమే మన సంపద రైతు సేవ సహకార సంఘంలో.. రూ.1.73 కోట్ల అవకతవకలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌళిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి *రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి* మాజీ మంత్రి బాలినేని ని కలిసిన గర్భం మూవీ హీరోయిన్ లక్షా మార్కాపురంలో ఆధార్ కేంద్రాలపై తహసీల్దార్ కె.చిరంజీవి ఆకస్మిక తనిఖీలు ప్రభుత్వ వైద్యశాలకు ఆరుగురు వైద్యులు నియామకం పల్లె పండుగ లో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, జిల్లా కలెక్టర్ గనియ రాజకుమారి కూటమి ప్రభుత్వం పరిపాలనపై ప్రజా అభిప్రాయ సేకరణ.. స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి శాంతి భద్రతల పరిరక్షణలో ఉపేక్షించేది లేదు - డిఎస్‌పి కొడకండ్ల ప్రెస్ క్లబ్ కు నూతన కార్యవర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై శ్రీశైలం పై చర్యలు తీసుకోవాలి

కారుణ్య నియామకం కోసం ఐదేళ్లుగా నిరీక్షణ

Select Suryaa Now
కారుణ్య నియామకం కోసం ఐదేళ్లుగా నిరీక్షణ

పులివెందుల మేజర్ న్యూస్, :

తండ్రి మృతిచెందిన అనంతరం నిబంధనల ప్రకారం రావాల్సిన కారుణ్య నియామక ఉద్యోగం కోసం ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని విజయ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం పులివెందులలోని వైఎస్ఆర్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తన గోడును వెల్లడించారు. ఈ సందర్భంగావిజయ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను మాజీ సైనికుడిగా పనిచేసి పదవీ విరమణ పొందినట్లు తెలిపారు. తన తండ్రి కే.కే.కొట్టాల గ్రామంలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యా యుడిగా పనిచేస్తూ 2021లో కరోనా సమ యంలో మృతిచెందారని చెప్పారు. తండ్రి మరణించిన తర్వాత వారసత్వ ప్రాతిపదికన కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలని సంబంధిత అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు.

పింఛన్‌పై అభ్యంతరం.. హైకోర్టు ఉత్తర్వులతో మరో మలుపు

తాను సైనిక పింఛన్ పొందుతున్నందున కారుణ్య ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని తొలుత అధికారులు చెప్పారని విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అయితే సైనిక పింఛన్‌ను ఆదాయంగా పరిగణించరాదంటూ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చిన అనంతరం తనకు అటెండర్ ఉద్యోగం కల్పిస్తామని అధికారులు చెప్పినట్లు పేర్కొన్నారు.
తాను డిగ్రీ విద్యార్హత కలిగి ఉన్నందున అటెండర్ ఉద్యోగానికి బదులుగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అందుకు వెయిటింగ్‌ లిస్టులో ఉండాలని అధికారులు సూచించారని చెప్పారు.

వయస్సు నిబంధనపై అభ్యంతరాలు

తదుపరి బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ సమయంలో అధికారులు తనను సంప్రదించి మాజీ సైనికుడిగా ఉన్నందున, పింఛన్ పొందుతున్నందున, వయస్సు పరిమితి దాటిపోయినందున జిల్లా పరిషత్‌ నుంచి వివరణ కోరినట్లు తెలిపారని విజయ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని పత్రాలను జిల్లా పరిషత్‌ అధికారులకు అందజేసినట్లు తెలిపారు.
అయితే ఈ అంశం తమ పరిధిలో లేదని జిల్లా పరిషత్‌ అధికారులు పేర్కొంటూ పత్రాలను పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపినట్లు చెప్పారని ఆయన వివరించారు. అక్కడికి వెళ్లినప్పుడు తిరిగి జిల్లా పరిషత్‌ అధికారులను సంప్రదించాలని సూచించారని, ఇలా ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి తిప్పుతూ ఐదేళ్లుగా తన సమస్యను పరిష్కరించకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్

కారుణ్య నియామకాలకు సంబంధించిన నిబంధనలపై తాను సమాచారం కోరినప్పటికీ, సంబంధిత అంశాన్ని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపినట్లు అధికారులు తెలిపారని విజయ్‌కు మార్‌రెడ్డి అన్నారు. కొందరి విషయంలో ఒక విధంగా, తన విషయంలో మరో విధంగా నిబంధనలను అమలు చేస్తున్నారని ఆరోపించారు.పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం నుంచి తనకు అందిన పత్రాల్లో కొందరు మార్పులు చేసి ఫోర్జరీకి పాల్పడి ఉద్యోగాలు పొందారని కూడా ఆయన ఆరోపించారు. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

జనసేన కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం

తన సమస్యను సంబంధిత మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించినట్లు విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అయితే మంత్రిని నేరుగా కలిసే అవకాశం లభించకపోవడంతో మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు.
ఐదేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తనకు న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌ స్పందించి తన కేసును పరిశీలించి, నిబంధనల ప్రకారం అర్హత ఉంటే కారుణ్య నియామకం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. “ఐదేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాను. ఇకనైనా ప్రభుత్వం స్పందించి నా కుటుంబానికి న్యాయం చేయాలి” అని విజయ్‌కుమార్‌రెడ్డి కోరారు.

పి కృష్ణ పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా