BREAKING
పంచాయితీ ఎన్నికలకు గుర్తులు సిద్ధం ఇజ్రాయెల్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు గడి ఐసెంకోట్‌కు ఆహ్వానం గంటలో రూ.8 కోట్లు కాజేసిన కేటుగాళ్లు టీడీపీకి హెచ్చరిక.. వైసీపీకి ఊరట..! హిందూ సమాజానికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి శుభాకాంక్షలు బొంరాస్‌పేటలో నూతన ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త కాంతులు తేవాలి : తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి ఆకాంక్ష తడగొండలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం సౌదీ అరేబియాలో ముగిసిన ముప్పు.. 'ఆల్ క్లియర్' ప్రకటన న్యూజిలాండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు మరింత ఆలస్యం కొలంబియా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి: ముగ్గురు సైనికులు మృతి జపాన్‌లో బలమైన భూకంపం: 5.7 తీవ్రత నమోదు మూడు చింతలపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

జగ్గయ్యపేట పట్టణం లో 18వ రోజుకి చేరుకున్న గడప గడపకు ప్రజా పోరుబాట కార్యక్రమం

Select Suryaa Now
జగ్గయ్యపేట పట్టణం లో 18వ రోజుకి చేరుకున్న గడప గడపకు ప్రజా పోరుబాట కార్యక్రమం

జగ్గయ్యపేటలో 18వ రోజుకు చేరుకున్న గడప గడపకు ప్రజాపోరుబాట కార్యక్రమం

కూటమి ప్రభుత్వం హామీలకే పరిమితం.. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు

వీధి దీపాలు, తాగునీటి సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్న తన్నీరు నాగేశ్వరరావు.

జగ్గయ్యపేట మేజర్ న్యూస్:- జగ్గయ్యపేట పట్టణంలోని 14వ వార్డు పద్మావతి నగర్‌లో గడప గడపకు ప్రజాపోరుబాట కార్యక్రమం 18వ రోజుకు చేరుకుంది. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు  ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా స్థానికులు వీధి దీపాలు, తాగునీటి సమస్యలను తన్నీరు నాగేశ్వరరావు  దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చి ఇంతకాలం గడిచినా కనీస మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. హామీల అమలులో మాత్రం పూర్తిగా విఫలమైందని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగిస్తోందని మండిపడ్డారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే కాదు.. వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున నిరంతరం పోరాడటమే వైఎస్ఆర్ సీపీ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, 14, 17 వార్డుల అధ్యక్షులు ఉప్పెల్లి పెంటయ్య, షేక్ ఖాదర్, చెరుకుమల్లి రాంబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ మున్సిపల్ విభాగ అధ్యక్షులు అన్నేపాక మురళీ, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, చికినం ఆనందబాబు, బురదగుంట మధుబాబు, బండ్ల సురేష్, దేవర్ల వెంకటేశ్వరరావు, ఉపెల్లి విజయ్ కుమార్, షేక్ ఖాదర్ (ఏకే), మల్లెల యేసు పాదం తదితరులు పాల్గొన్నారు

 

 

 

శివ జగ్గయ్యపేట ఎన్టీఆర్ జిల్లా