BREAKING
రాజ్యాంగం..దేశ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన గొప్ప వరం రాజ్యాంగ పరిరక్షణకు బహుజనులంతా ఐక్యంగా పోరాడాలి - బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్ పిలుపు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు భారతదేశ చరిత్రలో ఎంతో చారిత్రాత్మకమైన రోజు -మారాసు గురు బాబు, జనసేన పార్టీ నిజాంపట్నం ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు రాజ్యాంగ దినోత్సవ వేడుకలు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునేందుకు యువత సిద్ధం కావాలి- సిపిఎం పారిశుధ్య కార్మికుల సేవలకు గుర్తింపుగా స్వెట్టర్ల పంపిణీ చేసిన కౌన్సిలర్ సుహైల్ రానా చదువుకు ముందు పౌష్టిక అల్పాహారం! సర్పంచ్ అభ్యర్థి షబ్బీర్ వలిని ఆశీర్వదించండి.... ఎస్ వి సతీష్ రెడ్డి ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు వేంపల్లి అభివృద్ధికి... మంచం గుర్తుపై ఓటు వేయండి... నన్నూరు జెడ్పీ హైస్కూల్లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం గ్రామ సమస్యల పరిష్కారం.. అభివృద్ధే నా ధ్యేయం: మద్దికుంట నర్మద 52వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌళిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి *రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి*

Select Suryaa Now
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌళిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి *రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి*

ఏలూరు/​నూజివీడు, మేజర్ న్యూస్: నూజివీడు మండలం కొన్నంగుంట గ్రామంలో బుధవారం  డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామస్తులతో కలసి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. గ్రామస్తులను పేరుపేరున పలకరించి, జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంకా పెండింగులో ఉన్న పనులుపై గ్రామస్తులను అడిగి  మంత్రి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ​గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు వాడుకలోకి తీసుకు రావాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత నిస్తూ మౌళిక వసతులు కల్పనను ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. మురుగునీరు నిలవకుండా, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వాలుతో శాస్త్రీయంగా డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ​నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకూడదని, నిబంధనల ప్రకారమే మెటీరియల్ వినియోగించాలని స్పష్టం చేశారు. ​గ్రామీణ మౌళిక వసతులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి గ్రామంలోనూ రక్షిత మంచినీటిని, రోడ్లు, డ్రైనేజీ, తదితర మౌలిక సదుపాయాలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామనాయకులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

 జిల్లా ఇంచార్జ్ పసుమర్త  రాము ఏలూరు జిల్లా