ముగిసిన కాంగ్రెస్ యువ క్రాంతి బునియాది శిక్షణ
గుంటూరు / ఏలూరు, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటూరులో అక్టోబర్ 5,6,7 తేదీల్లో నిర్వహించిన మూడు రోజుల కాంగ్రెస్ పార్టీ యువ క్రాంతి బునియాది ట్రైనింగ్ క్యాంపు విజయవంతంగా ముగిసింది. ఈ శిక్షణ శిబిరంలో ఏలూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లి రామ సూరి రెడ్డి, ఏలూరు జిల్లాకు చెందిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సతీష్ రాయల్, ఏలూరు సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బురదగుంట లివిన్ క్రిస్టియన్ తదితరులు పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నూనె పవన్ తేజ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మూడు రోజుల శిక్షణ శిబిరంలో ఢిల్లీకి చెందిన పలువురు యూత్ కాంగ్రెస్ జాతీయ నాయకులు హాజరై, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలకు వివిధ అంశాలపై శిక్షణ అందించారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, యువజన కాంగ్రెస్ కార్యకలాపాలు, నాయకత్వ లక్షణాలు,ప్రజా సమస్యలపై పోరాటం,ప్రజలతో మమేకమై పనిచేసే విధానం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్,మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలి,ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ లెనిన్ ప్రసాద్,కో-ఇన్‌చార్జ్ మమతా నాగిరెడ్డి,నేషనల్ సెక్రటరీ నాగ మధు యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
న్యూస్ బ్యూరో కే బాలసౌరి, ఏలూరు జిల్లా