ప్రకృతి వ్యవసాయం రాష్ట్రానికే ఆదర్శవంతం. ఎంపీడీవో ఉషారాణి
తంబళ్లపల్లె మండలంలోని గుండ్లపల్లి రైతులు చేపడుతున్న ప్రకృతి వ్యవసాయం రాష్ట్రానికే ఆదర్శవంతం గా నిలిచినట్లు ఎంపీడీవో ఉషారాణి కొనియాడారు. బుధవారం పోర్డు డైరెక్టర్ లలితమ్మ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ రైతుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పంటల దిగుబడితో మానవాళి ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణ జరుగుతుందన్నారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి భావితరాలకు ప్రకృతి వ్యవసాయ ఫలాలు అందివాలన్నారు. గుండ్లపల్లి లో ప్రకృతి వ్యవసాయానికి రైతులను ప్రోత్సహించిన పోర్డు డైరెక్టర్ లలితమ్మ, సిబ్బందిని ప్రశంసించి ఇదే ఒరవడి కొనసాగించాలన్నారు. లలితమ్మ ప్రకృతి వ్యవసాయంలో జీవన ఎరువులు, కషాయాల తయారీ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు ఇరువురు 150 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఉలవలు తోపాటు ఆహార ఉత్పత్తి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోర్డు ప్రతినిధులు రమణ, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.
పాలగిరి గౌరి శంకర్ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇంచార్జ్