దోమల నివారణకు గంబూసియా చేపలు...
ములకలచెరువు మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా మలేరియా అధికారి రామచంద్ర రెడ్డి మరియు వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవి రెడ్డి,డా.రేష్మ బేగం, ఆధ్వర్యంలో గంబూసియా చేపలు తెప్పించి, ఊరికి దగ్గరలో ఉన్న నీటి కుంటలు,శుభ్రం చేయడానికి వీలు లేని నీటి నిల్వ ఉన్న గుంటలలో చేపలను వదిలారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చేపలు దోమలను నివారించినప్పటికీ, అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంఘం వీటిని ప్రపంచంలోని 100 ప్రమాదకరమైన ఆక్రమణ జాతులలో ఒకటిగా ప్రకటించింది.ఎందుకంటే, ఇవి స్థానిక చెరువులలోని ఇతర చిన్న చేపల గుడ్లను, కప్పల గుడ్లను తినేస్తూ స్థానిక జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తాయి.అందుకే వీటిని పెద్ద పెద్ద నదులు, సహజసిద్ధమైన సరస్సులలో కాకుండా కేవలం కృత్రిమ నీటి నిల్వలు, మురుగు కాలువలు, చిన్న గుంటలలో మాత్రమే పెంచాలని అన్నారు.ఈ చేపల ప్రధాన ఆహారం నీటిపై తేలే దోమల లార్వాలు గుడ్ల నుండి వచ్చే పిల్లలు పూర్తిగా పెరిగిన ఒక గంబూసియా చేప రోజుకు 100 నుండి 300 దోమల లార్వాలను తినగలదు. చెరువులు, బావులు, నిలిచిన నీటి గుంటలలో ఈ చేపలను వదలడం ద్వారా దోమల ఉత్పత్తిని తగ్గించి మలేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు,ఖాదర్ బాషా హెల్త్ అసిస్టెంట్,చంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.