ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం.
హరిత ఇంధనం తోనే రేపటి ప్రపంచం.
గ్రామ గ్రామానికి మెరుగైన విద్యుత్ ప్రగతి పదంలో దర్శి.
గత ప్రభుత్వంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలుపెంచిన జగన్.
గొట్టిపాటి లక్ష్మీ.
సూర్య న్యూస్ కురిచేడు. ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం సరికొత్త ప్రగతికి సంకేతమని, సౌర శక్తిని వాడుకొని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.
కురిచేడు మండలంలోని కల్లూరు గ్రామంలోని గురువారం . 3.80 కోట్ల రూపాయల తో ఏపీ ట్రాన్స్‌కో నిధులతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూకల్లూరు పరిసర గ్రామాలలో లో ఓల్టేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, వ్యవసాయ, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్ మౌలిక వసతులను బలోపేతం చేస్తుందని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ సహకారం తో దర్శి నియోజకవర్గం లో విద్యుత్ రంగంలో మౌలిక వసతుల కల్పన, కొత్త సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్ల నిర్మాణంతో ట్రాన్స్‌మిషన్ నష్టాలను గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల తాళ్లూరు మండలం లో 27 కోట్ల రూపాయలతో 132/33 కేవీ కెవి విధ్యుత్ సబ్‌స్టేషన్లను పూర్తి చేసి ప్రారంభించామన్నారు. కల్లూరు లో రు. 3.80 కోట్లు, ముండ్లమూరు మండలం, ఉల్లగల్లు గ్రామం లో రు.4.19 కోట్ల రూపాయలతో రెండు 33/11 కెవి విధ్యుత్ సబ్‌స్టేషన్లను పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం లేకుండా, రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించటం, గ్రామీణ ప్రాంతాల్లో సైతం నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని గొట్టిపాటి లక్ష్మీ తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, కురిచేడు మండల టిడిపి అధ్యక్షులు విడతల నెమిలయ్య, ఒంగోలు పార్లమెంట్ టిడిపి ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, గ్రామ టీడీపి అధ్యక్షులు షేక్ రఫీ, కందిమళ్ల ఆంజనేయులు, గ్రామ మాజీ సర్పంచ్ కందిమళ్ల సుబ్బులు, కిలారి కొండయ్య, బోల్లేపల్లి ఆదినారాయణ, కాటం చంద్ర రెడ్డి, డా. షేక్ సునీల్, ఏఎంసి డైరెక్ట్ సువయ్య, నీటి సంగం డి.సి ఉన్నగిరి కోటేశ్వరరావు, కల్లూరు గ్రామ టీడీపి అధ్యక్షులు, దర్శి నియోజకవర్గం , కురిచేడు టిడిపి సీనియర్ నాయకులు, కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.