BREAKING
రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి.

వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి

Select Suryaa Now
వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

అమలాపురం ప్రెస్ క్లబ్‌లో అగ్నికుల క్షత్రియుల వైసీపీ నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. వైసీపీ ఆర్టీఐ ఐటీ జోన్-2 రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు త్రినాథ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ మత్స్యకార నాయకులు, అగ్నికుల క్షత్రియుల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అగ్నికుల క్షత్రియులకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు అగ్నికుల క్షత్రియులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

నామినేటెడ్ పదవుల భర్తీలో తమ సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైసీపీ ఆర్టీఐ ఐటీ జోన్-2 రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు త్రినాథ వర్మ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల ఉపాధి, అభివృద్ధి కోసం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మత్స్యకారులకు, అగ్నికుల క్షత్రియులకు తగిన రాజకీయ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ప్రజలు ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ఆ వ్యతిరేకత స్పష్టమవుతుందని అన్నారు.

బీసీల్లో రెండవ స్థానంలో ఉన్న అగ్నికుల క్షత్రియులకు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని నాయకులు కోరారు. తమ సామాజికవర్గానికి రాజకీయంగా సముచిత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

మత్స్యకారులంతా వైసీపీ వెంటే ఉన్నారని నాయకులు స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయడంతో పాటు, 2029 సాధారణ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ విజయానికి అగ్నికుల క్షత్రియులంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో జిల్లా వైసీపీ మత్స్యకార నాయకులు, అగ్నికుల క్షత్రియుల నాయకులు, పార్టీ కార్యకర్తలు, వివిధ ప్రాంతాల ప్రతినిధులు పాల్గొన్నారు.