BREAKING
రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి.

భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు

Select Suryaa Now
భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు

పెదవేగి, మేజర్ న్యూస్ :రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్. శ్రీదేవి  ఆధ్వర్యంలో   ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  యన్. శ్రీలక్ష్మి గురువారం  పెదవేగి మండలం భోగాపురం గ్రామము నందు మహిళా చట్టాలపై  అవగాహన సదస్సును  నిర్వహించారు. ఈ సందర్భంగా  యన్ శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ కుటుంబ వివాదాల వల్ల కుటుంబ వ్యవస్థ, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని,  కావున చిన్న చిన్న గొడవలతో వివాదాలకు పోకుండా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు, వివాదాల పరిష్కారానికి  మధ్యవర్తిత్వం ఒక ఉత్తమ మార్గమని,  పోలీస్ శాఖ వారు,  న్యాయవాదులు ఈ కేసులు పైన ప్రత్యేక దృష్టి సారించి కేసులు పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కక్షిదారులు నేరుగా కాని, న్యాయవాది ద్వారా కాని సంబంధిత కోర్టులలో కేసులను మధ్య వర్తిత్వం కార్యాలయానికి రిఫర్ చేయించుకుని పరిష్కారానికి సహకరించాలని సూచించారు, అవసరమైన న్యాయ సలహాల కోసం 15100 సంప్రదించాలని తెలియజేశారు. మరియు కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీమతి సూర్య చక్రవేణి, వన్ స్టాప్ సెంటర్ లీగల్ అడ్వైజర్ తేజస్వి భోగాపురం గ్రామ కార్యదర్శి భూపతిరాజు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

 న్యూస్ బ్యూరో బాల సౌరి  ఏలూరు