BREAKING
గృహిణి అదృశ్యం సంక్లిష్టమైన ఛాతీ వ్యాధులకు రోబోట్ తో సులభంగా సర్జరీలు *యశోద హాస్పిటల్స్ థొరాసిక్ సర్జన్ డా. రోహన్ రెడ్డి* వల్లభరావుపాలెంలో ఎక్స్‌పోజర్ విజిట్ చేసిన...... మండల ప్రత్యేక అధికారి కె వి వి సత్యనారాయణ ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం

రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్

Select Suryaa Now
రీ సర్వే తో  భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్

సత్తుపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ దివాకర టిఎస్ పర్యటన

ప్రతి భూమికి సరిహద్దులతో స్పష్టమైన మ్యాప్


( కిరణ్ కుమార్ ఆరిక )

కల్లూరు సూర్య మేజర్ న్యూస్...
రైతుల భూ సమస్యలకు పరిష్కారమే రీ సర్వే ప్రధాన ఉద్దేశం అని జిల్లా కలెక్టర్ దివాకర్ స్పష్టం చేశారు.
కల్లూరు మండలం రఘునాధగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ 
భవిష్యత్ లో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతి భూమికి భూదార్ నెంబర్ తో పాటు రైతుల భూముల సరిహద్దులు, విస్తీర్ణాన్ని స్పష్టమైన మ్యాప్ తో రీసర్వే చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. గురువారం సత్తుపల్లి నియోజకవర్గం లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. కల్లూరు మండలం రఘునాధ్ గూడెం, రఘునాధ్ బంజర గ్రామాలలో రైతుల సమక్షంలో చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియ ను, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పొలం గట్టపై రైతులతో కలెక్టర్ ముచ్చటించి, రీ సర్వే పై వారి అభిప్రాయాలను తెలుసుకొని, రైతులు అడిగిన పలు సందేహలకు వివరణ ఇస్తూ వారి అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, దాదాపు వందేళ్ల తర్వాత ప్రభుత్వం రైతుల సమక్షంలో పారదర్శకంగా భూముల రీసర్వే చేపడుతోందన్నారు. ప్రతి భూమికి భూధార్ నంబర్ కేటాయించి, ఎల్పీఎం ద్వారా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, రైతులకు పాస్‌బుక్‌లో మ్యాప్ తో కలిపి అందిస్తామని తెలిపారు. రీసర్వే ద్వారా ఎవరి భూమిని తగ్గించడం లేదా పెంచడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, క్షేత్రస్ధాయిలో భూమే ప్రమాణంగా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతులు సర్వేయర్లు అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండి తమ భూముల సరిహద్దులను చూపించాలని కలెక్టర్ కోరారు. ప్రతి సర్వే నంబర్‌కు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, సర్వే తేదీలను రైతులకు ముందుగానే తెలియజేసి, నోటీసులు అందిస్తామని అన్నారు. రీసర్వే అనంతరం రైతుల సమక్షంలో భూమి విస్తీర్ణం, సరిహద్దులు, నమోదైన వివరాలను అక్కడికక్కడే వివరిస్తామని, రైతులకు సమస్యలు లేదా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే రైతుల కోరికమేరకు మరలా కూడా రీ సర్వే చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు మండల తహసీల్దార్, గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు, భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు.