గృహిణి అదృశ్యం
గృహిణి అదృశ్యం
గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిద్యాధర్ దాస్ జీవనోపాధి కోసం ఆగస్టులో హైదరాబాద్, మంఖల్ గ్రామానికి వచ్చి, ప్లంబర్ గా పని చేస్తూ నివసిస్తున్నాడు. సెప్టెంబర్ 8న అతని భార్య శిలులతదాస్(40) గృహిణి మంఖల్ కు వచ్చి అతనితో కలిసి నివసిస్తుంది. ఈనెల 6న ఉదయం 8:30గంటలకు బిద్యాధర్, తన భార్య శీలులతను గదిలో ఒంటరిగా వదిలి, తన పనికి వెళ్ళాడు. అదే రోజు సాయంత్రం 6గంటలకు అతను పని నుండి తిరిగి వచ్చి చూడగా తన భార్య ఇంట్లో కనిపించలేదు. తన భార్య గురించి చుట్టుపక్కల ప్రాంతాలలో, బంధువుల వద్ద వెతికిన ఆచూకీ లభించలేదు. దీంతో బిద్యదర్ గురువారం పహాడీ షరీఫ్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. తన భార్య హిందీ, ఒడియా భాషలు మాత్రమే మాట్లాడుతుందని పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.