BREAKING
బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి. న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి లలితాదేవి ఘనంగా అడివి బాపిరాజు జయంతి వేడుకలు

కభ్రస్థాన్ సమస్యకు పరిష్కారం - కలెక్టర్ దివాకర

Select Suryaa Now
కభ్రస్థాన్ సమస్యకు పరిష్కారం - కలెక్టర్ దివాకర

సత్తుపల్లి సూర్య మేజర్ న్యూస్...
(కిరణ్ కుమార్ ఆరిక )

సత్తుపల్లి పట్టణంలోని వేంసూరు రోడ్డులో నీలాద్రి అర్బన్ పార్క్ సమీపంలో ఉన్న ఖాబ్రస్తాన్ స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ గారు హామీ ఇచ్చారు.
ఎన్నో సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులకు, ముస్లిం సమాజానికి మధ్య వివాదంగా కొనసాగుతున్న ఖాబ్రస్తాన్ భూమి సమస్యను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్  ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లి, సమస్యను పూర్తిగా వివరించారు. అనంతరం కలెక్టర్ దివాకర్, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్‌ తో కలిసి ఖాబ్రస్తాన్ స్థలాన్ని పరిశీలించారు. సమస్యను పరిశీలించిన కలెక్టర్, సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అజయ్ యాదవ్, తహసిల్దార్ , ఎంపీడీఓ , ఫారెస్ట్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.