న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి లలితాదేవి
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; ఏలూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థ, తాడేపల్లిగూడెం ఇంచార్జ్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, 11వ అదనపు జిల్లా జడ్జి సుంకర శ్రీదేవి ఆదేశాల మేరకు మండల రెవెన్యూ కార్యాలయంలో తాడేపల్లిగూడెం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే.లలితదేవి అంగన్వాడీ టీచర్స్ కు ఐసిడిఎస్ సూపర్వైజర్స్ సహకారంతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో జడ్జి లలితదేవి మాట్లాడుతూ పిల్లలు ఆడ మగ తేడాలేకుండా అందరినీ విద్యావంతులను చేయాలనీ, చిన్నా పిల్లలకు గుడ్ టచ్ బాడ్ టచ్ పై అవగాహన కలిగించాలని, వరకట్నం అనే దురాచారం రూపుమాపాలని, బాల్యవివాహం నేరమని, మధ్యవర్తిత్వం మొదలగు విషయాలు తెలియచేసారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొవ్వూరి అప్పిరెడ్డి, మధ్యవర్తిత్వ లాయర్ లక్ష్మినారాయణ మధ్యవర్తిత్వం పైన , ప్యానెల్ అడ్వకేట్ సౌదామిని, ఐసిడిఎస్ సూపర్వైజర్ దుర్గాభవాని, విశాలాక్షి చైల్డ్ మ్యారేజస్ మొదలగు విషయాలు మీద అవగాహన కలిగించారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా