ఘనంగా అడివి బాపిరాజు జయంతి వేడుకలు
సూర్య న్యూస్ దర్శి .అభ్యుదయ కవి,రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు,చిత్రకారుడు,చలనచిత్ర సాంస్కృతిక దర్శకుడు కీ.శే.అడివి బాపిరాజు జయంతి ఉత్సవంను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు పి.రంగారావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిధులుగా విశ్రాంత మండల విద్యాశాఖాధికారి కాకర్ల రఘురామయ్య, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎగ్జికూటివ్ మెంబరు,మానవత స్వచ్ఛంద సేవాసంస్థ సెంట్రల్ కమిటీ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి,వక్తలు శ్రీనివాస ప్రసాదశర్మ, నారపుశెట్టి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత విద్యాశాఖ అధికారి రఘురామయ్య అడివి బాపిరాజు త్యాగాలను విరించి, ఈ పాఠశాలలో ఆనాటి తన చిన్ననాటి విద్యాబ్యాసం గురించి,ఆరోజుల్లో ఈ పాఠశాల స్థితిగతుల గురించి,1979-1980 లో పదోతరగతి పాసైన విధానం గురించి విద్యార్థులందరినీ ఆకట్టుకొనేవిధంగా ప్రసంగించారు. .ఈ కార్యక్రమంలో తురిమెళ్ళ శ్రీనివాసప్రసాదశర్మ, నారపుశెట్టి చైతన్య విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.