BREAKING
రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి.

అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం

Select Suryaa Now
అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం

సూర్య అద్దంకి.
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం
350 మంది రోగులకు వివిధ వైద్య పరీక్షలు, చికిత్సలు

 – ప్రజలకు అందుబాటులో బహుళ వైద్య సేవలు
సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 350 మంది రోగులకు వివిధ రకాల రక్త పరీక్షలు, వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్సలు మరియు వైద్య సలహాలు అందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ డాక్టర్ కె.వి. లక్ష్మీకుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.
అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ మహిళా చౌదరి మాట్లాడుతూ, శిబిరంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వివిధ వైద్య విభాగాలను ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య సేవలు అందించినట్లు తెలిపారు. ఈ శిబిరంలో సాధారణ వైద్య విభాగం, చర్మవ్యాధుల విభాగం, ఎముకలు–కీళ్ల వ్యాధుల విభాగం, మానసిక వైద్య విభాగం, స్త్రీల వైద్య విభాగం, ఆయుష్–ఆయుర్వేద వైద్య విభాగం, పిల్లల వైద్య విభాగం, దంత వైద్య విభాగం తదితర విభాగాల ద్వారా వైద్య సేవలు అందించారు. అదేవిధంగా శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ప్రత్యేక కంటి వైద్య విభాగాన్ని ఏర్పాటు చేసి కంటి పరీక్షలు, అవసరమైన వైద్య సలహాలు అందించారు.
శిబిరంలో డాక్టర్ వై.జె. జాస్మిన్ – సాధారణ వైద్యం, డాక్టర్ పి.వి. ప్రసాద్ – చర్మవ్యాధులు, డాక్టర్ పి. శశి కాంత్ మరియు శాస్త్ర చికిత్స వైద్య నిపుణులు వైద్య యాస్మిన్ ఆయుష్ వైద్యనిపులు డాక్టర్ షేక్ బాజీ షరీఫ్ పంటి వైద్యనిపుణులు డాక్టర్ మెరిసి పిల్లల వైద్యం నిపుణులు డాక్టర్ పి వి కిరణ్ అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ వాహనా చౌదరి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు హరి సుబ్బారావు హరిప్రసాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం డిప్యూటీ మీడియా ఆఫీసర్ కేఏ రాజు డిస్టిక్ హాస్పిటల్స్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ సూరిబాబు డా. అపర్ణ, శంకర కంటి ఆసుపత్రి పెదకాకాని వీఆర్వో శ్రీ బి సైదులు బాబు సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్ నార్ని రమేష్ ఆంజనేయులు  పాల్గొని జయప్రదం చేశారు ఈ సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా చీరాల బ్లడ్ బ్యాంక్ వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పదిమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు మండల పార్టీ నాయకులు శ్రీ ఎలమంద గారు పాల్గొని రక్త దానం చేశారు.