BREAKING
రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి.

న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం

Select Suryaa Now
న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం పట్టణంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వడ్డి రఘురామ్ నాయుడు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి వారు చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. న్యాయ వాదులు ప్రజలకు న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, తమ విధులను నిర్వహించే సమయంలో న్యాయవాదులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని రఘురామ్  పేర్కొన్నారు. న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు వంటి ఘటన లు చోటుచేసుకోకుండా వారికి ప్రత్యేక రక్షణ కల్పించే విధంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. న్యాయవాదుల న్యాయబద్ధమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని వడ్డి రఘురామ్ నాయుడు ప్రభుత్వాన్ని కోరారు. న్యాయవాదుల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరమని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను ఇక ఆలస్యం చేయకుండా తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు

 

 శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా