నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు
నేటి దినపత్రిక సూర్య బ్యూరో ( రాజమహేంద్రవరం )
జిల్లాలో నాలుగు మద్యం షాప్ లకు గురువారం నిర్వహించిన టెండర్ లలో ర 2026–27 సంవత్సరానికి 4 ఎక్సైజ్ షాపుల లైసెన్సుల మంజూరుకు లాటరీ ద్వారా ఖరారు అయినట్లు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026–27 సంవత్సరానికి అమలు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ ప్రకారం, భారతదేశంలో తయారైన విదేశీ మద్యం మరియు విదేశీ మద్యం ను రిటైల్ షాపుల ద్వారా విక్రయించేందుకు లైసెన్సుల మంజూరుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బిక్కవోలు, కడియం, కోవూరు, మండపేట రూరల్ మండలల్లో 4 షాప్ లకు టెండర్లు ఖరారు అయ్యినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ షాపులకు లైసెన్సు కాలం 01-10-2026 నుండి 30-09-2027 వరకు నిర్ణయించారు. రాజమహేంద్రవరం సబ్-కలెక్టర్ వారి ఆధ్వర్యంలో, అసిస్టెంట్ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ మరియు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికార్లు టెండర్ ప్రక్రియను పారాదర్శకంగా నిర్వహించారు.