BREAKING
రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి.

మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు

Select Suryaa Now
మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు

గ్యార్మీ గంధ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి : 

సూఫీ ఆధ్యాత్మిక గురువు హజ్రత్‌ షేక్‌ అబ్దుల్‌ ఖాదిర్‌ జిలానీని స్మరించే పవిత్ర ఉత్సవం గ్యార్మీ షరీఫ్‌ పండుగను మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం మెల్లెంపూడి గ్రామంలో ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ గ్యార్మీ గంధ మహోత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రత్యేక దువాలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖాదిర్ బోధనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమన్నారు. ఆధ్యాత్మిక చింతనను పండుగ ప్రబోధిస్తుందని.. మత సామరస్యం, సోదరభావానికి గ్యార్మీ లాంటి పండుగలు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెల్లెంపూడి గ్రామ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఖాశీంబాబు, బొమ్మారెడ్డి కోటిరెడ్డి, పఠాన్ ఖాశీంఖాన్, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు దాసరి కృష్ణ, హజరత్ మహబూబ్ సుభాని కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.