కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు
కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు
ఎమ్మిగనూరు టౌన్ సూర్య ప్రతినిధి
ఆచార్య శ్రీ శ్రీ శ్రీ చిన్న రామానుజ జీయర్ స్వామివారి సప్తతి తిరునక్షత్రం సందర్భంగా కోటేకల్ గ్రామంలో శ్రీరామ హృదయ కలశం ఊరేగింపును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామ వీధుల్లో జరిగిన ఊరేగింపులో భక్తులు భజనలు, శ్రీరామ నామస్మరణలతో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
శ్రీరామ హృదయ కలశాన్ని తాకి స్వామివారి ఆశీస్సులు పొందాలని భక్తులు ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం నెలకొనాలని ప్రార్థించారు. శ్రీ వైష్ణవ నరసింహమూర్తి స్వామివారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువకులు, భజన బృందం సభ్యులు, భక్తులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.