BREAKING
బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి గోవాడ గ్రామంలో పొలం బడి. న్యాయ విజ్ఞాన సదస్సులో జడ్జి లలితాదేవి ఘనంగా అడివి బాపిరాజు జయంతి వేడుకలు

లోక్ భవన్ ముట్టడిలో పాల్గొన్న రంగారెడ్డి DCC చీఫ్ పారిజాత

Select Suryaa Now
లోక్ భవన్ ముట్టడిలో పాల్గొన్న రంగారెడ్డి DCC చీఫ్ పారిజాత
  • కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్


కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, 'ఇండియా' కూటమి మరియు ఏఐసీసీ (AICC) పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించాయి.


ఈ నిరసన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొని, కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో ఈసీ విఫలమైందంటూ ఆమె ధ్వజమెత్తారు. ఈ నిరసన ప్రదర్శనలో జాతీయ మరియు రాష్ట్ర స్థాయి నాయకులు పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి, కోఆర్డినేటర్ సచిన్ సావంత్, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పోలీసుల అడ్డంకులను, ఆంక్షలను సైతం లెక్కచేయకుండా లోక్ భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని డిసిసి అధ్యక్షురాలు స్పష్టంచేశారు.

  • S.గణేష్ : మేజర్ న్యూస్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి.