21వ రోజుకు చేరిన వీఆర్ఏ ల సమ్మె
పెంటపాడు, మేజర్ న్యూస్; పెంటపాడు మండల వీఆర్ఏ లు ఈరోజు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా 100 సంతకాల సేకరణ కార్యక్రమంతో 21వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. ప్రధాన డిమాండ్లు వీఆర్ఏ లకు పే స్కేల్ అమలు చేయాలని,అర్హులైన వీఆర్ఏ లకు ప్రమోషన్లు కల్పించాలి, నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏ లను రెగ్యులర్ చేయాలి అని డిమాండ్ చేశారు. మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల వీఆర్ఏ ల అధ్యక్షులు కె. మధు, ఎం. సువర్ణరాజు, బి. పాపయ్యమ్మ, కె. సుబ్బలక్ష్మి వీఆర్ఏ లు పాల్గొన్నారు.
రిపోర్టర్ శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా