మునుగోడు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
మునుగోడు మండల కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
మునుగోడు,మేజర్ న్యూస్:
మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని నియమించారు. మునుగోడు మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులుతో సంప్రదించిన అనంతరం కొత్త కమిటీ ప్రతిపాదనలను బుదవారం నుంచి అమలులోకి వచ్చేలా ఆమోదించినట్లు ప్రకటన విడుదల చేశారు.నూతనంగా నియమితులైన మండల కమిటీ సభ్యులలో ఉపాధ్యక్షులుగా పాలకూరి యాదయ్య, చెరుకుపల్లి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శులుగా తాటికొండ సైదులు, మాదగోని రాజేష్, ముప్ప రవీందర్ రెడ్డి, మందుల బీరప్ప, కార్యదర్శులుగా సంకు శంకర్, పంధుల సంపత్, జక్కల శ్రీను, నన్నురి శేఖర్ రెడ్డి, నకిరేకంటి యాదయ్య, అరెళ్ల సైదులు.కార్యవర్గ సభ్యులుగా అనగంటి కృష్ణ, మేడి నాగలక్ష్మి, పంతంగి స్వామి, ఆవుల శ్రీనివాస్, పాలకూరి మహేష్ లు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు.మునుగోడు మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత సమన్వయంతో నిర్వహిస్తూ, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని నాయకులు పేర్కొన్నారు.తమ నియమానికి సహకరించిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి, డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేతకి, డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డికి, చండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణకి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులుకి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కొంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.