సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య
ఏలూరు, మేజర్ న్యూస్: సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అనే అంశం పై ఆంద్రప్రదేశ్ బాలల హక్కుల కమీషన్, మరియు చైల్డ్ ఫండ్ ఇండియా, ఒలం ఫుడ్ ఇగ్రిడియన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు జిల్లా కేంద్రం లోని స్థానిక సెమినార్ హాల్ లో వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. . ఈ కార్యక్రమంలో జిల్లా లోని రిమోట్ ఏరియాలో ప్రత్యేకించి గిరిజన ప్రాంతాల్లో నివసించే బాలల స్థితిగతులపై చర్చించడం జరిగింది. బాలల కొరకు పని చేసే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి బాల స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, నీడ్ బేస్డ్ అసెస్మెంట్ చేసి తదనుగుణంగా పని చేయటానికి స్వచంద సంస్థలు ప్రభుత్వం తో కలిసి పని చేయటానికి ముందుకు రావాలని ఆంద్రప్రదేశ్ బాలల హక్కుల కమీషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు సూచించారు. జిల్లా లో మారుమూల గిరిజన ప్రాంతాల లో బాలల కోసం పనిచేస్తున్న స్వచ్చంద సంస్థల ప్రతినిధులను అభినందించారు. బాలలకు హక్కులకు రక్షణ కల్పించి వైద్య, విద్య, అందేలా సమిష్టిగా కృషి చేద్దామన్నారు. ఇలాంటి వర్క్ షాప్స్ నిర్వహించటం ద్వారా బాలల సంరక్షణ అభివృధి కొరకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయటానికి ఉపయోగపడతాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఒలం ఫుడ్ ఇగ్రిడియన్స్ జనరల్ మేనేజర్క లువ శ్రీధర్ , డిప్యూటీ మేనేజర్ ఆదిత్య, క్లస్టర్ లిడ్ హరికృష్ణ , చైల్డ్ ఫండ్ ఇండియా మేనేజర్ రాకేష్ కుమార్, భద్రాచలం ఫీల్డ్ ఆఫీసర్ బుచ్చిబాబు , సుకెందు గారు, ఐసిడిఎస్ పిడి శారద , డిసిపిఓ సిహెచ్. సూర్య చక్రవేణి , డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాస్ , ఎ సి ఎల్ నాగేశ్వర రావు , ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ als coordinator , డి సి పి యు, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, స్వచంద సంస్థలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి