BREAKING
గ్లోబల్ మార్కెట్లలో సరికొత్త జోరు... బలమైన ట్రెండ్‌లో వాల్‌స్ట్రీట్ సూచీలు జన్మదిన వేడుకల్లో యాదాల సాయి కిరణ్ సైబర్ నేరగాళ్లపై మెగా వేట.. 100 మందికి పైగా అరెస్ట్! విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు !

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.... జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్.

Select Suryaa Now
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.... జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్.

రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్.
నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్....
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందులో భాగంగానే  యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నట్లు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఈ పాఠశాలల్లో 2,500 మంది విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు.మిర్యాలగూడ నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికై మంగళవారం ఆయన మిర్యాలగూడ మండలం, జప్తి వీరప్పగూడెం గ్రామంలోని సర్వే నంబర్ 214లో సుమారు 20 నుంచి 25 ఎకరాల స్థలాన్ని  పరిశీలించారు. పాఠశాల నిర్మాణానికి అనువుగా ఉన్న స్థల వివరాలు, సంబంధించిన లే అవుట్లు, భూ రికార్డుల వివరాలన్నింటినీ సమర్పించాలని రెవిన్యూ అధికారులను ఆదేశించారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో 2500 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా తరగతి గదులు, డార్మెటరీలు, కిచెన్, డైనింగ్, ల్యాబ్లు, లైబ్రరీ, ఆట స్థలాలు, ఇలా అన్ని సౌకర్యాలను కల్పించి కార్పొరేట్ తరహాలో వీటిని తీర్చిదిద్దనున్నారు.