BREAKING
కడప నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు 100 కోట్ల ప్రయాణాలతో 'స్త్రీ శక్తి' చారిత్రాత్మక ఘనత. -మహిళలతో పాటు ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు గ్రామ గడపకే వైద్యం : మంత్రి సత్యకుమార్ యాదవ్ కోదండ రామునికి ఘనంగా ఘటాభిషేకం మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భారీ విస్తరణ.. ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళ్తున్న అభిమానులు! సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్.. మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ... ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు దేచుపాలెంలో రూ.31 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనం ప్రారంభం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్ శిక్షణ గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని వినియోగించుకోవాలి దసరా ఉత్సవాలకు తెదేపా నేత భార్గవ రామ్ ను ఆహ్వానించిన ఆర్యవైశ్యులు ఈశ్వరయ్యను పరామర్శించినపట్టణ కార్యదర్శి అంగన్వాడీ ఉత్సవం–పిఎం మాతృ వందన యోజనపై అవగాహన

నిరాధార ఆరోపణలతో మా ఉపాధి హరించొద్దు!*

Select Suryaa Now
నిరాధార ఆరోపణలతో మా ఉపాధి హరించొద్దు!*

 


*-ఫార్మా పరిశ్రమలు మూతపడితే వేలాది కుటుంబాలు రోడ్డున పడుతాయి*

*-పీసీబీ,కలెక్టర్ కు ఫార్మా ఉద్యోగుల విజ్ఞప్తి*

యాదాద్రి భువనగిరి ప్రతినిధి, మేజర్ న్యూస్
నిరాధార ఆరోపణలతో ఫార్మా పరిశ్రమలు మూతపడే పరిస్థితి రాకుండా చూడాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమలు మూతపడితే వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతి గూడెం, అంతమ్మగూడెం గ్రామాల పరిధిలోని సెజ్‌లో ఉన్న హేజలో ల్యాబ్స్, బృందావన్ లేబరేటరీస్, వీజే సాయి కెమ్, ఎస్వీఆర్ లేబరేటరీస్ తదితర సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు మంగళవారం నల్లగొండలోని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రాంతీయ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.అంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు.
*వాస్తవాలు పరిశీలించాకే చర్యలు*
కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసం ఫార్మా కంపెనీలపై వరుసగా ఆరోపణలు చేస్తున్నారని ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, వాటి ద్వారా తమకు ఉపాధి లభిస్తోందని తెలిపారు. కంపెనీలపై వచ్చే ప్రతి ఫిర్యాదునూ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, వాస్తవాలు నిర్ధారించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని కోరారు.
*నిబంధనల ఉల్లంఘనపై చర్యలకు మద్దతు*
కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, భద్రత విషయంలో నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై చర్యలు తీసుకోవడాన్ని తాము వ్యతిరేకించబోమని ఉద్యోగులు స్పష్టం చేశారు.అయితే ఆధారాలు లేని ఆరోపణలతో పరిశ్రమలు మూతపడితే తమ కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
*వేలాది కుటుంబాలపై ప్రభావం*
పీసీబీ అధికారులు వివిధ సందర్భాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం, ఫిర్యాదులపై చర్యలు తీసుకునే క్రమంలో చిన్న, పెద్ద పరిశ్రమలు ఇబ్బందులకు గురవుతున్నాయని ఉద్యోగులు తెలిపారు. పరిశ్రమలు మూతపడితే సుమారు 6 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమలు నిబంధనలు పాటించేలా పర్యవేక్షిస్తూ.. తమ ఉపాధికి భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని, పీసీబీ అధికారులను కోరారు.