లక్ష్మక్కపల్లి చెక్‌డ్యామ్‌పై అధికారుల పరిశీలన
సూర్య వీణవంక: మండలంలోని లక్ష్మక్కపల్లి గ్రామ పరిధిలోని చెక్‌డ్యామ్‌ను నీటిపారుదల శాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు. చెక్‌డ్యామ్ పనుల నాణ్యత, నిర్మాణ పరిస్థితులు, ఇతర అంశాలపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.ఇటీవల చెక్‌డ్యామ్‌కు సంబంధించిన అంశాలపై గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో అధికారులు స్పందించి పరిశీలన చేపట్టారు.ఈ సందర్భంగా ENC కరీంనగర్ సత్యనారాయణ రెడ్డి, SE శ్రీనివాస్, EE ప్రశాంతి, DEE మమత, AEE మహేష్ తదితర అధికారులు చెక్‌డ్యామ్‌ను పరిశీలించారు. పనులకు సంబంధించిన వివరాలు, నిర్మాణ నాణ్యత తదితర అంశాలను పరిశీలించిన అనంతరం సమగ్ర విచారణ చేపట్టి, పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు తెలిపారు.చెక్‌డ్యామ్‌పై అధికారులు చేపట్టిన విచారణతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.