వీఆర్సీ గ్రౌండ్ అభివృద్ధికి శ్రీకారం!
నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలోని వీఆర్సీ గ్రౌండ్‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు సందర్శించారు. వీఆర్సీ గ్రౌండ్‌లోని వాకర్స్ అసోసియేషన్, స్పోర్ట్స్ పర్సన్స్, వాకర్స్, మరియు స్థానికుల అభ్యర్థన మేరకు గ్రౌండ్‌ను మరింత అభివృద్ధి చేసి, ఆధునిక వసతులతో సుందరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారాయణ గారు చర్యలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతిరోజూ వాకింగ్ చేసే వారికి సౌకర్యవంతంగా ఉండేలా వాకింగ్ ట్రాక్, క్రీడాకారులకు ఉపయోగపడేలా బాస్కెట్‌బాల్ కోర్ట్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి, వీఆర్సీ గ్రౌండ్‌ను ప్రజలకు, క్రీడాకారులకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. వీఆర్సీ గ్రౌండ్ అభివృద్ధి చెందడం వల్ల వాకర్స్, క్రీడాకారులు, యువతతో పాటు నగర ప్రజలందరికీ ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆరోగ్యం, క్రీడలు, ఆహ్లాదం కలగలిపిన ఒక అందమైన ప్రదేశంగా వీఆర్సీ గ్రౌండ్‌ను తీర్చిదిద్దే ఈ నిర్ణయం పట్ల వాకర్స్ అసోసియేషన్, స్పోర్ట్స్ పర్సన్స్, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి శ్రీ నారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. నెల్లూరు నగర అభివృద్ధి – ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజా ప్రభుత్వం. ప్రజల కోరికలకు స్పందిస్తూ… నెల్లూరు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ… ఆధునిక వసతులతో మన నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
దర్శి హరికృష్ణ
నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి
నెల్లూరు సిటీ 44వ డివిజన్ ఇంచార్జ్
తెలుగుదేశం పార్టీ