BREAKING
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో ప్రతిభ కనపరచిన గిరిజన విద్యార్థులు కడప నగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు 100 కోట్ల ప్రయాణాలతో 'స్త్రీ శక్తి' చారిత్రాత్మక ఘనత. -మహిళలతో పాటు ఆర్టీసీ సిబ్బందికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు గ్రామ గడపకే వైద్యం : మంత్రి సత్యకుమార్ యాదవ్ కోదండ రామునికి ఘనంగా ఘటాభిషేకం మహారాష్ట్రలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ భారీ విస్తరణ.. ప్రత్యేక కార్యక్రమాలతో దూసుకెళ్తున్న అభిమానులు! సోలార్ విద్యుత్‌తో పేదలకు భారీ ప్రయోజనం రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్.. మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ... ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాలు దేచుపాలెంలో రూ.31 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనం ప్రారంభం రేణిగుంట పోలీస్ స్టేషన్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ తహశీల్దార్ శిక్షణ గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని వినియోగించుకోవాలి దసరా ఉత్సవాలకు తెదేపా నేత భార్గవ రామ్ ను ఆహ్వానించిన ఆర్యవైశ్యులు ఈశ్వరయ్యను పరామర్శించినపట్టణ కార్యదర్శి

వరుణ యాగంలో పాల్గొన్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ..!

Select Suryaa Now
వరుణ యాగంలో పాల్గొన్న ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ..!

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలి...రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలి..!

దుత్తలూరు,  మేజర్ న్యూస్ :     ఉదయగిరి నియోజకవర్గం, దుత్తలూరు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నర్రవాడ శ్రీ వేంగమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన వరుణ యాగంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ప్రకృతి అనుకూలంగా ఉండి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలు కళకళలాడాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ వేద పండితుల ఆధ్వర్యంలో వరుణ యాగాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం ఉదయగిరి నియోజకవర్గం తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి జలవనరులు నిండాలని, రైతాంగానికి మేలు జరగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, వేద పండితులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.