BREAKING
నూతనంగా ఎన్నికైన ఎస్ఎంసి చైర్మన్. కు ఘన సన్మానం మంత్రి లోకేష్ కు మల్లన్న ప్రసాదం అందచేత ఘనంగా కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి జన్మదిన వేడుకలు... పట్టభద్రుల ఓటు.. ప్రజాస్వామ్యానికి బలం-డా గుండెబోయిన రమేష్ యాదవ్ ర్యాగింగ్‌కు నో చెప్పండి.. స్నేహపూర్వక వాతావరణాన్ని నిర్మిద్దాం డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి మరో మూడు నూతన పేటెంట్లు. శభాష్ గాయత్రీ దివ్యాంగ భక్తుడి ఆకలి తీర్చిన ద్వారకాతిరుమల ఆలయ మహిళా సిబ్బందికి సీఎం ప్రశంస మీ సహృదయానికి అభినందనలు అంటూ ఎక్స్‌లో సీఎం పోస్ట్ శ్రీశైలంలో మహిళపై దేవస్థానం ఉద్యోగి అఘాయిత్యం..! గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారికి ఆహ్వానం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అమెరికాలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ మల్లన్న సన్నిధిలో ఎస్టీ కమిషన్ సభ్యుడు వెంకటప్ప భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవమును పురస్కరించుకొని *సేవా సంకల్ప అభియాన్* కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కొందుర్గ్ మండల అధ్యక్షుడిగా మల్లని యాదయ్య గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ వర్చువల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

వ్యాపారుల నుంచి రఘునాథ్ డబ్బులు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలను నిరూపించాలి

Select Suryaa Now
వ్యాపారుల నుంచి రఘునాథ్ డబ్బులు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలను నిరూపించాలి

 సూర్య మంచిర్యాల టౌన్ : 

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌పై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో హాజీపూర్ మండల అధ్యక్షులు గడ్డం స్వామి రెడ్డి, మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ల జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్‌కుమార్, నస్పూర్ జోన్ అధ్యక్షులు కుర్రె చక్రవర్తి  మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం రఘునాథ్ వెరబెల్లి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న నాయకుడిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు.బీజేపీలో ప్రస్తుతం ఎలాంటి బాధ్యతలు లేని బొలిశెట్టి తిరుపతి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన మడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.జాతీయ రహదారి–63 అంశంపై స్పష్టత జాతీయ రహదారి–63 విషయంలో రఘునాథ్ వెరబెల్లి ఎవరికి నష్టం కలగకుండా లక్షెట్టిపేట పట్టణం మీదుగా కాకుండా పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మించాలని మాత్రమే కోరారని నాయకులు తెలిపారు. అలైన్‌మెంట్ మార్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడా కోరలేదన్నారు.ఈ వ్యవహారంలో వ్యాపారుల నుంచి రఘునాథ్ డబ్బులు తీసుకున్నారంటూ చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు.ఆరోపణలకు ఆధారాలు చూపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను అవమానించే విధంగా కొందరికి పదవులు ఇస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు.గతంలో బొలిశెట్టి తిరుపతిని హాజీపూర్ మండల అధ్యక్షుడిగా, మడిపల్లి సత్యంను మండల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినది రఘునాథ్ వెరబెల్లేనని గుర్తు చేశారు.అలాగే బొలిశెట్టి తిరుపతి కుమారుడికి గతంలో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుతం యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు ఇప్పించడంలో రఘునాథ్ పాత్ర ఉందని పేర్కొన్నారు.జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్న రఘునాథ్ వెరబెల్లి, నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌పై ఇకపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని నాయకులు హెచ్చరించారు.ఈ సమావేశంలో మధువరపు రమణరావు, బియ్యాల సతీష్‌రావు, హనుమండ్ల శ్రీనివాస్, కొట్టే ప్రశాంత్, మెరెడికొండ శ్రీనివాస్, రాజనర్సు, కొంకటి మహేందర్, ఇలవేణి సతీష్, సాగర్, చిందం తిరుపతి, బూర్ల అజయ్, కంపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.