సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదలకు ఒక వరం:మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య
వికారాబాద్, మేజర్ న్యూస్: ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నిరుపేదలకు ఒక వరంలా ఉపయోగపడుతోందని వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య అన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 36 మంది లబ్ధిదారులకు మంగళవారం ఆమె సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గడ్డం అనన్య మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో పేదలకు వైద్యం భారం కాకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఎంఆర్‌ఎఫ్ నిధులను పెద్ద ఎత్తున మంజూరు చేస్తున్నారని తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గంలో స్పీకర్, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ చొరవతో అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎంఆర్‌ఎఫ్ ప్రయోజనం అందేలా కృషి చేస్తున్నారని చెప్పారు.అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఎంతో భరోసానిస్తున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని కుటుంబాలకు ఈ సహాయ నిధి ఊరటనిస్తోందన్నారు. ప్రజల కష్టాల్లో ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఏఎంసీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అశోక్, వికారాబాద్ రిపోర్టర్.