బొగ్గు లైన్లో నివసించే ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల ఇండ్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించి ఇవ్వాలి- మంత్రి ఫరూక్ కి సిపిఎం వినతి
నంద్యాల బ్యూరో: నంద్యాల పట్టణంలోని బొగ్గు లైన్లో నివసించే పేద ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మాత్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ కి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, కే మహమ్మద్ గౌస్, పి వెంకట లింగం, వీరితో పాటు బొగ్గులైన్ ప్రాంతవాసులు వీరన్న, సాయి తో పాటు మహిళలు పాల్గొనడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడున్నటువంటి బొగ్గు లైన్ ప్రాంత ప్రజలంతా సహకరించాలి అని చెప్పి అర్బటంగా పనులు మొదలుపెట్టడం జరిగింది.అయితే అక్కడున్న ప్రజలంతా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలంతా ఆందోళన చేపట్టగా రెండు సెంట్లు స్థలము ఇస్తామని, ఇల్లు నిర్మించేందుకు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిధులను ఇస్తామని అదేవిధంగా విద్యుత్తు, నీరు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినప్పుడు మీ ఇంటిని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తామని,అప్పటిదాకా మీ ఇళ్లను పడగొట్టబోమని మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది.
వీరితో పాటుగా మున్సిపల్ కమిషనర్, తహాసిల్దార్, హౌసింగ్ డి.ఈ, ఎలక్ట్రికల్ అధికారులంతా ఒక కమిటీగా పి జి ఆర్ ఎస్ సెంటనరీ హాల్ లో కూర్చుని బొగ్గులైన్ లో నివసించే ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి రెండు సెంట్ల స్థలం ఇచ్చి, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అదేవిధంగా రోడ్డు కాలువలు వీధిలైట్లు నీరు కరెంటు లాంటి సమస్యలను పరిష్కారం చేస్తామని హామీని ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాకు తిట్టుకో గృహాలు వద్దు అని ఆరోజు ప్రజలంతా చెప్పగా మీకందరికీ టిడ్కో గృహాలను ఇవ్వబోము ఇంటి స్థలాలే ఇస్తాము. గతంలో ఒక సెంటు ఇచ్చినవారికి వాటిని కొట్టి వేసి రెండు సెంట్లు స్థలం ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలియజేయడంతో ప్రజలంతా ఆందోళనను విరమించుకోవడం జరిగింది. కావున ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీ ప్రకారము బొగ్గు లైన్లో నివసించే ప్రజలందరికీ నెరవేర్చాలని సిపిఎం పార్టీగా కోరారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*