శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలకు హాజరు కావాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రి లోకేష్ కు వేదాశీర్వచనం చేశారు. దేవాలయ అధికారులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాలను అందించారు.