మాల్తుమ్మెద సొసైటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం
► అధ్యక్షుడి తోపాటు12 మంది పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం.
► సహకార సంఘం అభివృద్ధే లక్ష్యం.
- రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందిస్తా.
► నూతన చైర్మన్ కలాలి సురేందర్‌గౌడ్.
సూర్య, నాగిరెడ్డిపేట్,
నాగిరెడ్డిపేట్ మండలంలోని మాల్తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం సోసైటీ కార్యాలయంలో మంగళవారం ప్రమాణ స్వీకారం చేసింది. ఎల్లారెడ్డి క్లస్టర్ సహకార సంఘం అసిస్టెంట్ రిజిస్ట్రార్ అధికారి లక్ష్మణ్ సమక్షంలో సొసైటీ నూతన అధ్యక్షుడు గోలిలింగాల్ గ్రామానికి చెందిన కలాలి సురేందర్‌గౌడ్ , తోపాటు నియామకమైన 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన పాలకవర్గంలో చైర్మన్ గా కలాలి సురేందర్‌గౌడ్, డైరెక్టర్లు కొమ్మ గల్ల భీమయ్య, షేక్ అసీఫ్, పెద్దప్పట్లోళ్ల మహేశ్వర్ రెడ్డి, గంపల వెంకయ్య, విట్టల్ రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి, మూడేరు సాయిరాం, సిందిగారి సుజాత, రాజిపేట యాదగిరి, జి. సాయికుమార్, సిహెచ్. భూపాల్ రెడ్డి, పర్మల్ల దుర్గమ్మ, బారాధి ప్రతిభ, లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను పూలమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ ... రైతులకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని, సహకార సంఘం అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తనను అధ్యక్షుడిగా నియామకం చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ తహశీల్దార్ వెంకట్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్, ఆర్ ఐ అజయ్, సొసైటీ సీఈవో సందీప్ , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, మండల సర్పంచ్ పోరం అధ్యక్షుడు మురళి మోహన్ గౌడ్,ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.