సేవే సంకల్పం సమాజా సేవే లక్ష్యం
సేవే సంకల్పం.. సమాజ సేవే లక్ష్యం!
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని
పురస్కరించుకుని నిర్వహిస్తున్న “సేవా సంకల్ప్ అభియాన్”లో భాగంగా మంగళవారం మండలంలోని జైత్వారం–పులిమామిడి అంగన్‌వాడీ కేంద్రంలో “అంగన్ మిలన్ సేవ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కందుకూరు మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యతోపాటు గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అంగన్‌వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. “సేవే పరమావధి–దేశమే ప్రథమం” అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శులు చిలుకల రఘునందన్, గౌర ప్రభాకర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మల్లేష్, సీనియర్ నాయకులు మాసన్నగారి వెంకట్‌రెడ్డి, మండల కార్యదర్శి నరసింహ, జైత్వారం ఉప సర్పంచ్ నవీన్, బూత్ అధ్యక్షులు పాండు, ఆగిరెడ్డి, ఆంజనేయులు యాదవ్, పులిమామిడి బూత్ అధ్యక్షుడు మహేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్:మేజర్, న్యూస్ కందుకూరు.