BREAKING
గ్లోబల్ మార్కెట్లలో సరికొత్త జోరు... బలమైన ట్రెండ్‌లో వాల్‌స్ట్రీట్ సూచీలు జన్మదిన వేడుకల్లో యాదాల సాయి కిరణ్ సైబర్ నేరగాళ్లపై మెగా వేట.. 100 మందికి పైగా అరెస్ట్! విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు !

సీఎం హామీలతో ప్రొద్దుటూరు అభివృద్ధికి కొత్త ఊపిరి — ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

Select Suryaa Now
సీఎం హామీలతో ప్రొద్దుటూరు అభివృద్ధికి కొత్త ఊపిరి — ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

జలజీవన్‌ మిషన్‌ను ప్రొద్దుటూరు నుంచి ప్రారంభించడం శుభసూచకం

ప్రొద్దుటూరు అర్బన్ మేజర్ న్యూస్:

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలజీవన్‌ మిషన్‌ 2.0 – అమరజీవి జలధార కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నుంచి ప్రారంభించడం శుభసూచకమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ పాల్గొని జలజీవన్‌ మిషన్‌ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రొద్దుటూరు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం నియోజకవర్గ ప్రజలకు గర్వకారణమన్నారు. సభకు సుమారు 75 వేల మంది ప్రజలు హాజరై విజయవంతం చేయడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన ప్రజలను చూసిన ముఖ్యమంత్రి, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రొద్దుటూరు అభివృద్ధికి పలు హామీలు ఇవ్వడం, వాటికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు.

ముఖ్యంగా నూతన ఆర్టీసీ బస్టాండ్‌, పాలిటెక్నిక్‌ కళాశాల నూతన భవన సముదాయం, ప్రొద్దుటూరు ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించడం పట్ల ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం అమలు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం‌లకు ప్రొద్దుటూరు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సభను విజయవంతం చేయడంలో కృషి చేసిన జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎస్పీ, రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు, ఇతర శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షం ఓర్వలేక అవాకులు, చవాకులు మాట్లాడటం సరికాదు.

ఈ సందర్భంగా షేక్‌ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ వి.ఎస్. ముక్తియార్‌ మాట్లాడుతూ ప్రొద్దుటూరులో జరిగిన భారీ బహిరంగ సభను చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక అవాకులు, చవాకులు మాట్లాడటం సరికాదన్నారు. ముఖ్యమంత్రి ఏ ప్రాంతానికి పర్యటనకు వచ్చినా జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, పోలీసు యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావడం సహజమన్నారు.

ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి గుర్తుంచుకుని మాట్లాడాలని ముక్తియార్‌ హితవు పలికారు. ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించిన హామీలను స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.