BREAKING
విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు ! దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్ల వేట.. 100 మందికి పైగా అరెస్ట్ 22ఏ జాబితా నుండి తొలగింపునకు 517 అర్జీలు అందగా వాటిలో 217 అర్జీలు ఆమోదించమo జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యే విఫలం

ఫేస్‌బుక్ హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు

Select Suryaa Now
ఫేస్‌బుక్ హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు

ఫేస్‌బుక్ హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు

పోలీసు అధికారి పేరుతో బెదిరింపులు.. రూ.3.50 లక్షలు వసూలు

సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్ట్.. రూ.2.40 లక్షలు రికవరీ

చిల్లకల్లు, ఎన్టీఆర్ జిల్లా:

ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా వ్యక్తిని హనీ ట్రాప్‌లోకి దించి, అనంతరం పోలీసు అధికారి పేరుతో బెదిరించి రూ.3.50 లక్షలు వసూలు చేసిన సైబర్ మోసాన్ని చిల్లకల్లు పోలీసులు ఛేదించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు బాధితుడికి చెందిన రూ.2.40 లక్షలను రికవరీ చేశారు.

*ఫేస్‌బుక్ మెసేజ్‌తో వల*

జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన వ్యక్తికి “Monalisha Sahu” పేరుతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతా నుంచి మెసేజ్‌లు, అభ్యంతరకరమైన కంటెంట్ వచ్చాయి. వాటిని నమ్మిన బాధితుడు తన మొబైల్ నంబర్‌ను అవతలి వ్యక్తికి అందించాడు. అనంతరం అతడికి ఫోన్ కాల్ వచ్చింది.

తాను పోలీసు అధికారినంటూ పరిచయం చేసుకున్న వ్యక్తి.. “మోనాలిసా అనే మహిళ ఆత్మహత్యకు ప్రయత్నిస్తోంది. ఆమె రాసిన లేఖలో నీ పేరు, ఫోన్ నంబర్ ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. మీడియాలో నీ పేరు వస్తుంది” అంటూ బాధితుడిని తీవ్రంగా బెదిరించాడు.

*విడతల వారీగా రూ.3.50 లక్షలు*

పోలీసు కేసు, అరెస్ట్, పరువు పోతుందనే భయంతో బాధితుడు నిందితులు సూచించిన బ్యాంకు ఖాతాలకు ఫోన్‌పే ద్వారా, స్నేహితుల సహాయంతో విడతల వారీగా మొత్తం రూ.3,50,000 బదిలీ చేశాడు. డబ్బులు అందుకున్న అనంతరం నిందితులు తమ ఫోన్ నంబర్లను స్విచ్ఛాఫ్ చేశారు.

దీంతో బాధితుడు చిల్లకల్లు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు*

పోలీసులు నిందితుల కదలికలను గుర్తించేందుకు కాల్ డేటా రికార్డులు (CDR), బ్యాంకు ఖాతాల లావాదేవీలు, మొబైల్ టవర్ లొకేషన్లు తదితర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. పక్కా ఆధారాలు సేకరించి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

నిందితుడి బ్యాంకు ఖాతాలను సకాలంలో ఫ్రీజ్ చేయడంతో రూ.2,40,000 నగదును రికవరీ చేశారు. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేసేందుకు పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు.

*అపరిచిత సోషల్ మీడియా ఖాతాలతో జాగ్రత్త*

అపరిచిత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, మెసేజ్‌లు, వీడియో కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే భయపడకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.