BREAKING
సైబర్ నేరగాళ్లపై మెగా వేట.. 100 మందికి పైగా అరెస్ట్! విశాఖ నేవీపై పాక్‌ ‘హనీట్రాప్‌’ వల! పాకిస్థాన్‌కు రహస్యాలు లీక్.. 10 రాష్ట్రాల్లో సోదాలు గిద్దలూరు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల పేకాట స్థావరంపై అశ్వరావుపేట పోలీసుల మెరుపు దాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ విజయం స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ దూకుడు.. విద్యుత్ రంగంపై మంత్రి గొట్టిపాటి ఫోకస్ ! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం -చేర్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నిందితుడు పై పీడీ యాక్ట్ కేసు నమోదు సురక్షితమైన బాల్యం.... నిరంతర విద్య అప్పు చేసి మరీ ఐఫోన్లు కొనకండి.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్! *అట్య-పట్య రాష్ట్ర క్రీడలకు కరీంనగర్ 'సాన్వి' విద్యార్థులు జూనియర్ కళాశాల లేఖను ఇబ్రహీం కి అందించిన మధుసూదన్ నాయుడు ! దక్షిణాది రాష్ట్రాల్లో సైబర్ కేటుగాళ్ల వేట.. 100 మందికి పైగా అరెస్ట్ 22ఏ జాబితా నుండి తొలగింపునకు 517 అర్జీలు అందగా వాటిలో 217 అర్జీలు ఆమోదించమo జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

నర్రవాడ పీహెచ్‌సీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీ..!

Select Suryaa Now
నర్రవాడ పీహెచ్‌సీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీ..!

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం.. అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు..!

దుత్తలూరు,  మేజర్ న్యూస్ :    దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే గారు అక్కడి వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, రోగులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని జనరల్ వార్డు, కాన్పుల గది, వైద్య పరీక్షల గదులు, రోగుల కోసం అందుబాటులో ఉన్న ఇతర సౌకర్యాలను ఎమ్మెల్యే గారు పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, వైద్య సిబ్బంది హాజరు, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర వైద్య సేవలు తదితర అంశాలపై సంబంధిత వైద్యులు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో వైద్య సేవలు, అవసరమైన మందులు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆరోగ్య కేంద్రానికి వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయి, మందులు అందుతున్నాయా, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిని సానుకూలంగా విన్న ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య వ్యవస్థపై నమ్మకం కలిగేలా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్యం.. పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నర్రవాడ పీహెచ్‌సీ పరిధిలో ప్రజలకు వైద్య సేవల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, అవసరమైన సమస్యలను సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు తెలిపారు.