వరుణదేవా కటాక్షించు...
కరేశ్వర స్వామి దేవస్థానంలో శాస్త్రోక్తంగా వరుణయాగం
తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్: మండలంలోని శ్రీ కరేశ్వర స్వామి దేవస్థానంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా వరుణయాగాన్ని నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన యాగంలో భక్తులు, స్థానికులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరుణయాగంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతి దంపతులు భాగస్వాములై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరేశ్వర స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, వరుణదేవుడి కరుణతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని వారు ఆకాంక్షించారు. రైతులు సకాలంలో వర్షాలు పొంది వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించి సంతోషంగా ఉండాలని సోమిరెడ్డి దంపతులు ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.