యువతకు స్ఫూర్తినిచ్చేలా నిలవాలి
వేంపల్లె మేజర్ న్యూస్:
యువతకు స్పూర్తినిచ్చేలా కార్యసాధన కొనసాగించాలని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, న్యాయవాది జీవి రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లాకు చెందిన టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, జీవి రెడ్డిని తన కార్యాలయంలో కలిశారు. అనంతరం వివిధ సామాజిక, రాజకీయ, భవిష్యత్ కార్యాచరణ తదితర వాటిపై సలహాలు సూచనలు చేశారు. యువత తోనే దేశ భవిష్యత్ దాగి ఉందని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ బాబు పాల్గొన్నారు.
గండికోట షేక్ ఖదీర్ వేంపల్లి కడప జిల్లా