రైతులకు అందుబాటులో యూరియా, డిఎపి ఎరువులు
ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా పారదర్శకంగా రైతులకు ఎరువుల పంపిణీ,మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి
ముద్దనూరు మేజర్ న్యూస్ : మండలంలోని రైతులకు డిఎపి మరియు యూరియా ఎరువులు అందుబాటులో ఉన్నాయని కావలసిన రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించి ఎరువులను పొందాలి అన్నారు.ఎపి ఎయిమ్స్ యాప్ ద్వారా పంట సాగువివరాలను బట్టి ఎరువుల పంపిణీ జరుగుతుంది అన్నారు.నల్లబల్లె,తిమ్మాపురం, పెనీకలపాడు 1,పెనీకలపాడు-2 ,కొర్రపాడు రైతు సేవా కేంద్రాల్లో యూరియా,డిఎపి ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.