BREAKING
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు కోనప్ప జన్మదినం సందర్భంగా విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ విద్యారంగ, నిరుద్యోగ సమస్యలపై పోరాడాలి పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ పిలుపు సౌర విద్యుత్‌తో బిల్లుల భారం తగ్గించుకోవాలి స్థానిక ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా పనిచేయాలి పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే పరిటాల సునీత దిశానిర్దేశం విద్యుత్ లో వోల్టేజీ తో పంటలు ఎండుతున్నాయి. అడవులదీవి టిడిపి పార్టీ కార్యాలయంలో నాయకుల సమావేశం ఏపీలో మీసేవలో కీలక సేవలు పునరుద్ధరించాలి రెవిన్యూ లో పనులు జరగడం లేదు... రీసర్వే పట్టాదార్ పాస్ పుస్తకాల్లో సర్వే నంబర్ల తప్పులు తడక బతుకమ్మ పండుగ ఏర్పాట్లు ముమ్మరం.... ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ....... జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపు. కరువు పైన రైతుల అగ్రహానికి గురికావద్దు సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు - సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి - పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరి పోలాలను పరిశీలించిన శాస్త్ర వేత్తలు.!. వి బి జి రామ్ పనులను పరిశీలించిన జడ్పి సీఈవో

హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్

Select Suryaa Now
హత్యాయత్నం కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్

సూర్య, కోరుట్ల అర్బన్ :కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్‌లో జరిగిన హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఠాకూర్ వినయ్ సింగ్ (31)ను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేసినట్లు సిఐ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..2024 జూన్ 24న పాత కక్షల నేపథ్యంలో పొగుల రాజేష్‌పై నిందితులు పథకం ప్రకారం దాడి చేసి హత్యకు యత్నించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే A-2 నుంచి A-6 వరకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.కాగా, అప్పటి నుంచి పరారీలో ఉన్న A-1 ఠాకూర్ వినయ్ సింగ్‌ను సీఐ లక్ష్మీ నారాయణకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ ఐ శ్యామ్ రాజ్ తన సిబ్బందితో కలిసి మంగళవారం కోరుట్ల బస్‌స్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఆయన పేర్కొన్నారు. నేరాలకు పాల్పడి ఎంతకాలం పరారీలో ఉన్నా చట్టం నుంచి తప్పించుకోలేరని, నేర సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.