కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాల
కడప: ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. తమ న్యాయపరమైన సమస్యల పరిష్కరించాలంటూ కడప రిమ్స్ ఆసుపత్రిలోని ఓపి విభాగం వద్ద నడిరోడ్డుపై వారు మంగళవారం ఆందోళన నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ అధికారులు, ఇతర పారామెడికల్ విభాగాల్లో సేవలందిస్తున్నారని తెలిపారు.
కడప క్రైమ్ రిపోర్టర్, వేణు.