బాపట్ల శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ జపములు మరియు వరుణ యాగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో, బాపట్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీమత్ సుందరవಲ್ಲಿ రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో లోక క్షేమం కోసం వరుణ జపములు మరియు వరుణ యాగం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు ఉత్సాహంగా పాల్గొని, స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.